తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన చిత్రం ” సార్ ”. తెలుగు , తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొత్తానికి 100 కోట్ల వసూళ్లను సాధించింది. తమిళంలో వాతి గా విడుదలైన ఈ చిత్రం తెలుగులోనే ఎక్కువ వసూళ్లు సాధించడం విశేషం. ఫిబ్రవరి 17 న విడుదలైన సార్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాడు సార్.
రఘువరన్ బిటెక్ చిత్రంతో ధనుష్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో తన ప్రతీ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తూ ఇక్కడ కూడా మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డాడు ధనుష్. అలా చేస్తూ ఇప్పుడు ఏకంగా ద్విభాషా చిత్రం చేసే అవకాశం దక్కింది. దాంతో మంచి వసూళ్లు ధనుష్ సొంతమయ్యాయి.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. అనిరుద్ సంగీతం అందించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని విలన్ గా నటించగా కీలక పాత్రల్లో సాయి కుమార్ , హైపర్ ఆది తదితరులు నటించారు.