తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం ” సార్ “. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో ఈనెల 17 న విడుదల కానుంది. ఇక ఈరోజు అంటే ఫిబ్రవరి 15 న హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఇంతకీ ధనుష్ సార్ సెన్సార్ టాక్ ఏంటో తెలుసా……. ఒక్క ముక్కలో చెప్పాలంటే…… బాగుందని అంటున్నారు సెన్సార్ సభ్యులు. ప్రస్తుతం విద్యావ్యవస్థలో సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను చక్కగా ప్రతిబింబించేలా చూపించారని ప్రశంసల వర్షం కురిపించారట. సెన్సార్ సభ్యుల ప్రశంసలు లభించడంతో సార్ యూనిట్ చాలా సంతోషంగా ఉందని సమాచారం.
అయితే సెన్సార్ టాక్ బాగానే ఉన్నప్పటికీ ……. అసలైన తీర్పు మాత్రం ఇవ్వాల్సింది ప్రేక్షకులు మాత్రమే . ఆ అసలైన తీర్పు ఈనెల 17 న ఇవ్వనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 17 న సార్ చిత్రం విడుదల అవుతోంది. ధనుష్ సరసన మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమాపై ధనుష్ అలాగే సంయుక్త ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు ఏమౌతాయో ఈనెల 17 న తేలనుంది.