నటీనటులు : ధనుష్ , సంయుక్త మీనన్ , ఆది , సముద్రఖని
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాణం : సితార ఎంటర్ టైన్ మెంట్స్ – ఫార్చూన్ ఫోర్ సినిమాస్
దర్శకత్వం : వెంకీ అట్లూరి
విడుదల తేదీ : 17 ఫిబ్రవరి 2023
రేటింగ్ : 3/ 5
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన చిత్రం ” సార్ ”. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. టీజర్ , ట్రైలర్ లతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను సార్ అందుకున్నాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ :
ఈ కథ 1998- 2000 మధ్య కాలంలో సాగుతుంది . త్రిపాఠి విద్యాసంస్థల చైర్మన్ త్రిపాఠి ( సముద్రఖని ) విద్యను వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తే మనిషి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి ఫీజులు కూడా అధికంగానే ఉంటాయని చెప్పి భారీగా ఫీజులు వసూల్ చేస్తుండటంతో పెద్ద ఎత్తున ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది. దాంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో త్రిపాఠి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. తన సంస్థలో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వ కలశాలలకు పంపించి ఉన్నతమైన విద్యను అందించే ప్రయత్నం పేరుతో ప్రభుత్వ కళాశాలలను మరింత నాశనం చేయాలనీ తద్వారా తన సంస్థలను మరింత బలోపేతం చేయాలనీ అనుకుంటాడు. అయితే ఆ మిషన్ లో భాగంగా బాల ( ధనుష్ ) ఓ ప్రభుత్వ కళాశాలకు వెళ్తాడు. అయితే త్రిపాఠి ఆలోచనలకు భిన్నంగా ప్రభుత్వ కళాశాల స్టూడెంట్స్ ఎందులోనూ తీసిపోరు అని నిరూపించే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు ? చివరకు ఎలాంటి విజయాలను అందుకున్నాడు అన్నదే ఈ చిత్ర కథ.
హైలెట్స్ :
ధనుష్
డైలాగ్స్
సముద్రఖని
సాయి కుమార్
డ్రా బ్యాక్స్ :
ట్విస్ట్ లు లేకపోవడం
నటీనటుల ప్రతిభ :
ధనుష్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి . సార్ చిత్రాన్ని తన భుజస్కంధాలపై మోశాడు ధనుష్. లెక్చరర్ గా అద్భుత అభినయం ప్రదర్శించాడు. ఇక సంయుక్త మీనన్ కు అంతగా ప్రాధాన్యత లేని పాత్ర అయినప్పటికీ ఉన్నంతలో మెప్పించింది. హైపర్ ఆది నవ్వించే ప్రయత్నం చేసాడు. సాయి కుమార్ కు మరోసారి మంచి పాత్ర లభించింది దాంతో తన ప్రతిభ చాటుకున్నారు ….. అనుభవాన్ని ప్రదర్శించారు. విలన్ గా సముద్రఖని గురించి చెప్పేదేముంది మరోసారి విలన్ గా మెప్పించాడు. ఇక మిగతా పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ ప్రతిభను చాటుకున్నారు.
సాంకేతిక వర్గం :
జీవీ ప్రకాష్ అందించిన పాటలు బాగున్నాయి అలాగే నేపథ్య సంగీతం తో కూడా అలరించాడు. యువరాజ్ అందించిన విజువల్స్ బాగున్నాయి. 23 ఏళ్ల నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి విషయానికి వస్తే …… విద్యావ్యవస్థలో ఉన్న అసమానతల గురించి చక్కగా కథను రూపొందించుకున్నాడు కానీ సరైన స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు. ఎలాంటి ట్విస్ట్ లు లేకపోవడం కొంత మైనస్.
ఓవరాల్ గా :
తప్పకుండా ఓసారి చూడొచ్చు.