తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. దాంతో ఈ సినిమాను చూసిన నెటిజన్లు తమతమ అభిప్రాయాలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. ఇంతకీ ట్విట్టర్ వీరుల ప్రకారం ఈ సినిమా ఫలితం ఎలా ఉందో తెలుసా….
మిశ్రమ స్పందన వస్తోంది. సార్ చిత్రం విద్యా వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన నిర్లక్ష్యం, అవినీతిని వెల్లడించేలా సాగింది. 23 ఏళ్ల క్రితం విద్యావ్యవస్థలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. దాంతో ఈ కథాంశాన్ని కొంతమంది నెటిజన్లు అభినందిస్తుంటే మరికొంతమంది మాత్రం పెదవి విరుస్తున్నారు. మంచి సందేశం ఉంది కాని పెద్దగా ట్విస్ట్ లు లేవని అంటున్నారు. అయితే అసలు తీర్పు మాత్రం కొద్ది గంటల్లో అసలైన ప్రేక్షకులు ఇవ్వనున్నారు.
ధనుష్ , సంయుక్త మీనన్ , సముద్రఖని , సాయి కుమార్ , ఆది తదితరులు నటించిన ఈ చిత్రం పై ధనుష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తెలుగులో కూడా తన రేంజ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు ధనుష్.