తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ” సార్ ”. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ధనుష్ ఈ చిత్రంలో లెక్చరర్ గా నటించాడు. ఈనెల 17 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతున్న నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను విడుదల చేసారు.
ఇక ట్రైలర్ లో ఈ సినిమా ఏ అంశం మీద రూపొందిందో వివరించారు. ఉన్నత చదువుల కోసం పేదలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ….. అలాగే ఎంత దారుణాలు చోటు చేసుకుంటున్నాయో ……. విద్య ఎంత ఖర్చుతో కూడుకున్నదో చక్కగా వివరించే కథాంశంతో సార్ చిత్రాన్ని రూపొందించారు. ధనుష్ చిత్రాలకు ఇటీవల కాలంలో తెలుగులో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది ….. పైగా ఈ చిత్రాన్నిరూపొందింది తెలుగు దర్శకుడు కావడం విశేషం.
ధనుష్ కూడా సౌత్ లో మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఈ సినిమా చేసాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సాయి కుమార్ , సముద్రఖని , హైపర్ ఆది తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా ? లేదా ? అన్నది ఈనెల 17 న తేలనుంది. ట్రైలర్ మామూలుగానే ఉంది. విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి అనే కథాంశం జనాలకు నచ్చితే హిట్ చేస్తారు ….. లేదంటే షరామామూలే.