
Suma : యాంకర్ సుమ అంటే తెలియని వారుండరు. తన భాష కాకపోయినా తెలుగు చక్కగా ఉచ్చరిస్తూ యాంకరింగ్ లో ఎవరూ పట్టుకోలేని ఎత్తుకు ఎదిగింది ఆమె. హీరో, హీరోయిన్లకు ఉన్నట్లు యాంకర్ గా ఆమెకు కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అసలు యాంకరింగ్ అనే పదానికే బ్రాండ్ అంబాసిడర్ ఆమె అనే చెప్పాలి. తన సమకాలీక యాంకర్లు అయిన ఝాన్నీ, ఉదయభాను, తదితరులు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయినా ఇంకా ఆమె తన స్థానాన్ని మాత్రం పదిలం చేసుకుంటూనే కొనసాగుతోంది. ఈ మధ్య సినిమాల్లో లీడ్ రోల్స్ లో కూడా నటిస్తున్నారు ఆమె. ‘జయమ్మ పంచాయతి’ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
రీసెంట్ గా ఆమె తన యూట్యూబ్ చానల్ ద్వారా ఒక వీడియోను షేర్ చేసింది. ఫుడ్ పికిల్ ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తూ వీడియో చేశారు. ఇందుతో తన భర్త రాజీవ్ కనకాల కూడా ఉన్నాడు. సుమ ప్రమోట్ చేసిన పికిల్ ప్రొడక్ట్ నాసిరకమైనవి, పెద్దగా గుర్తింపు లేదని, టేస్ట్ లెస్ కావడంతో ఎవరూ వీటిని పట్టించుకోవడం లేదని ఆ బ్రాండ్ కు సుమ ప్రమోట్ చేయడం దారుణమని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. ఈ ప్రమోషన్ విషయంలో ఆమెకు నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. డబ్బు కోసం ఇంత నాసిరకం ప్రొడక్ట్స్ ను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటూ చాలా మంది కామెంట్ల రూపంలో మందలిస్తున్నారు. ఈ ప్రొడక్ట్స్ ఇంటికి వచ్చేలోపలే పాడవుతున్నాయని నెటిజన్లు మొత్తుకుంటున్నారు. యాంకరింగ్ లో ఇంత సంపాదించిన సుమ ఇలాంటి నాసిరకం ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసి తన ఫేమ్ ను కూడా పోగొట్టుకుంటున్నారని ట్రోల్స్ చేస్తున్నారు.
ఇప్పటి వరకూ సుమ పర్సనల్ లైఫ్ మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతోంది. భర్త, పిల్లలతో ఆమె ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో కొన్ని రూమర్లు వ్యాపించినా వాటిపై ఆమె ఎప్పుడూ స్పందించలేదు. సినిమాల్లో ఐటం గర్ల్ గా గుర్తింపు సంపాదించుకున్న ఒక హీరోయిన్ తో రాజీవ్ కనకాల తిరగడం, దీంతో సుమ, రాజీవ్ కనకాల మధ్య కొన్ని వైరుధ్యాలు వచ్చాయట. కానీ వాటిని పట్టించుకోలేదు సుమ. తన భర్తపై తనకు నమ్మకం ఉందని, అప్పుడే భార్యా భర్తల బంధం నిలుస్తుందని ఆమె తన భర్తను వెనకేసుకువచ్చారు. ఏది ఏమైనా సుమ ప్రమోట్ చేస్తున్న ప్రొడక్ట్ మాత్రం సరికాదని, తన కాంట్రాక్ట్ నుంచి దీన్ని తప్పించాలని నెటిజన్లు కోరుతున్నారు.