యంగ్ హీరో విశ్వక్ సేన్ హిట్ 2 సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాడా ? అనే మాట వినబడుతోంది ఫిలిం నగర్ సర్కిల్లో. హీరో నాని నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ” హిట్ ” . శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కరోనా వేవ్ లేకపోతే మరిన్ని వసూళ్లు సాధించి సూపర్ డూపర్ హిట్ అయ్యుండేది. అలాగే విశ్వక్ సేన్ కు నటుడిగా మంచి మార్కులు పడ్డాయి కూడా.
హిట్ సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా హిట్ 2 చిత్రం కూడా నిర్మించాడు నాని. అయితే హిట్ సినిమా హిట్ కావడంతో విశ్వక్ సేన్ తోనే పార్ట్ 2 తీయాలని అనుకున్నాడు నాని . అందుకే దర్శకుడు శైలేష్ కొలను ను విశ్వక్ దగ్గరకు పంపించాడు. అయితే వెంటనే మీకు డేట్స్ ఇవ్వలేను ఎందుకంటే నేను ఒప్పుకున్న వేరే సినిమాలు క్యూలో ఉన్నాయి వాటిని సైడ్ చేసి మీకు డేట్స్ ఇవ్వడం భావ్యం కాదు ……. అలాగే మీరు కూడా వెంటనే డేట్స్ అడగడం కూడా కరెక్ట్ కాదని చెప్పాడట. దాంతో మరో హీరోతో ఈ సినిమా చేస్తామని ముందుగానే చెప్పాడట దర్శకుడు శైలేష్ కొలను.
ఇంకేముంది విశ్వక్ అలా అనడంతో ఎవరు అయితే బాగుంటుంది అని ఆలోచించిన తర్వాత అడవి శేష్ మదిలో మెదిలాడట. దాంతో అడవి శేష్ దగ్గరకు వెళ్లి కథ చెప్పాడు శైలేష్ . కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అడవి శేష్ . కాకపోతే మొదటి పార్ట్ లో విశ్వక్ నటించాడు మరి విశ్వక్ సేన్ కు ఈ విషయం చెప్పారా ? అని అడిగాడట. విశ్వక్ ఖాళీ లేడు కాబట్టి అతడికి మరో హీరోతో చేస్తామని చెప్పమని క్లియర్ గా చెప్పారట. దాంతో ఇక మరో ఆలోచన లేకుండా హిట్ 2 సినిమా చేసాడు అడవి శేష్.
కట్ చేస్తే ఈరోజు హిట్ 2 విడుదల అయ్యింది. సినిమాకు ఓవర్ సీస్ లో హిట్ టాక్ లభించింది. ఈ సినిమా చూసిన వాళ్ళు బాగుందని ట్వీట్ చేస్తున్నారు. ఇక అసలైన రిజల్ట్ మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. దాంతో విశ్వక్ సేన్ ఈ సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాడా ? ఒప్పు చేశాడా ? అనే విషయం తేలిపోనుంది.