
మంచు మోహన్ బాబు ఇంట్లో ఇంకా గొడవలు సద్దుమణగలేదు అనే మాటలు వినబడుతున్నాయి. ఇటీవల మంచు విష్ణు సారధి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి గొడవ పడుతున్న సమయంలో మంచు మనోజ్ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కట్ చేస్తే అబ్బే ! అలాంటిదేమి లేదని చెప్పారు. అంతేకాదు ” house of manchus ” అనే రియాలిటీ షో చేస్తున్నామని మంచు విష్ణు ఓ వీడీయోను పోస్ట్ చేసాడు.
దాంతో ఇదంతా రియాలిటీ షో కోసమా ? అని ఆశర్యపోయారు. కట్ చేస్తే మంచు విష్ణు చేస్తున్న రియాలిటీ షోకు మాకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు మంచు లక్ష్మీ ప్రసన్న , మంచు మనోజ్. దాంతో మంచు విష్ణు రిలీజ్ చేసిన రియాలిటీ షో వీడియో అంతా ఉత్తిదేనా ? లేక ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది కాబట్టి ఇలా ప్లాన్ చేశాడా ? అంటూ ఆశర్య పోతున్నారు నెటిజన్లు.
ప్రస్తుతానికి మంచు కుటుంబంలో వివాదం లేదు కానీ అలాగని అన్నా దమ్ముల మధ్య అయితే ప్రేమలు , అనుబంధాలు అయితే లేవు ఇది సుస్పష్టం. మంచు విష్ణు హీరోగా బిజీ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే మంచు మనోజ్ కూడా చాలా గ్యాప్ తీసుకున్నాను కాబట్టి తప్పకుండా వెంటనే సినిమాను పూర్తి చేయాలనే తలంపుతో ఉన్నాడు.






