సినిమాలను బ్రతికించడానికి సినిమా థియేటర్ , మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్లు తగ్గించాలని నిర్ణయించామని వెల్లడించాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఆగస్టు 1 నుండి సినిమా షూటింగ్ లన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. బడ్జెట్ ఎక్కువ కావడం , అలాగే థియేటర్ , మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో పలు అంశాలపై చర్చించారు.
ఇప్పటికే పలు కమిటీలు వేసి చర్చలు సాగించారు. అయితే మళ్ళీ షూటింగ్ లు స్టార్ట్ అయ్యేది ఇంకా డిసైడ్ కాలేదని , కాకపోతే మరో నాలుగైదు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు దిల్ రాజు. ఇక ఓటీటీ ల విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించామని , సినిమా విడుదల అయ్యాక 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీ లో రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చామని తెలిపాడు. గత 18 రోజులుగా చర్చలు సాగుతూనే ఉన్నాయని , మంచి ఫలితాల కోసమే ఈ చర్చలు అంటూ వెల్లడించాడు దిల్ రాజు. ఈ సమావేశంలో పలువురు నిర్మాతలు పాల్గొన్నారు.
Breaking News