
రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం ” వారియర్ ”. కాగా ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు లింగుస్వామికి తమిళనాడు హైకోర్టు 6 నెలల జైలుశిక్ష విధించింది. దాంతో ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అంతేకాదు ఈ శిక్ష పై అప్పీల్ కు వెళ్తానని కూడా పేర్కొన్నాడు.
అసలు విషయం ఏంటంటే …… తమిళ స్టార్ హీరో కార్తీ – సమంత జంటగా ” ఎన్ని ఇజు నాల్ ” అనే సినిమాను రూపొందించడానికి పీవీపీ క్యాపిటల్ నుండి 35 లక్షల అప్పు తీసుకున్నాడు దర్శకుడు లింగుస్వామి. అయితే కార్తీ – సమంత లతో అనుకున్న ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఆ సినిమా కోసం అప్పుగా తీసుకున్న 35 లక్షలు కూడా ఖర్చు అయ్యాయి. దాంతో పీవీపీ క్యాపిటల్ కు డబ్బు ఇవ్వలేకపోయాడు.
చెక్ ఇచ్చాడు కానీ అది బౌన్స్ అయ్యింది. దాంతో సదరు ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు లింగుస్వామికి 6 నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 10 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. దాంతో మళ్ళీ అప్పీల్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
లింగుస్వామి తమిళంలో పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అయితే ఇటీవల కాలంలో అతడు దర్శకత్వం వహించిన చిత్రాలు ప్లాప్ అవుతున్నాయి. హీరో రామ్ నటించిన వారియర్ కూడా డిజాస్టర్ అయ్యింది. వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్న లింగుస్వామికి స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడం లేదు. దాంతో మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి పాపం.






