టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకులు , నిర్మాత సాగర్ (70 ) అనారోగ్యంతో మృతి చెందారు. తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సాగర్ పూర్తి పేరు విద్యాసాగర్ రెడ్డి . 1952 మార్చి 1 న గుంటూరు జిల్లాలోని నిడమర్రు అనే గ్రామంలో జన్మించారు. సినిమాలపై మక్కువతో చిత్ర రంగ ప్రవేశం చేసాడు.
రాకాసి లోయ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాగర్ ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మొత్తంగా 30 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించాడు. స్టువర్ట్ పురం దొంగలు , అమ్మ దొంగ , రామసక్కనోడు తదితర సూపర్ హిట్ చిత్రాలు సాగర్ దర్శకత్వంలో వచ్చినవే ! ప్రముఖ దర్శకులు వివివినాయక్ , శ్రీను వైట్ల తదితరులు సాగర్ శిష్యులు కావడం గమనార్హం. దర్శకుల సంఘం కు మూడు సార్లు అధ్యక్షుడిగా పనిచేసారు సాగర్. దర్శకుడిగానే కాకుండా పలు చిత్రాలను కూడా నిర్మించారు. సాగర్ మృతి పట్ల పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.