
దర్శకులు త్రివిక్రమ్ తన భార్య సౌజన్యకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు. BMW 7 సిరీస్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు త్రివిక్రమ్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. BMW ప్రతినిధి కారు తాళాలు త్రివిక్రమ్ భార్య సౌజన్యకు ఇస్తుండగా ఆ పక్కనే త్రివిక్రమ్ ఉన్నాడు. మధ్యలో BMW కారు ఉంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
త్రివిక్రమ్ భార్య సౌజన్య కూచిపూడి నృత్య కళాకారిణి అనే విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రదర్శనలు ఇచ్చింది. సుప్రసిద్ధ నృత్య కళాకారిణిగా మంచి పేరుంది ఆమెకు. ఇక దర్శకుడు త్రివిక్రమ్ గురించి కొత్తగా చెప్పేదేముంది …… మాటల మాంత్రికుడు. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ 3 రోజుల పాటు జరిగింది. మళ్ళీ షెడ్యూల్ ప్రారంభించాలి అనుకునేలోపు మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణించడంతో వాయిదా పడింది. మహేష్ బాబు వీలును బట్టి ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.