వెంకటేష్ మహ, సుహాస్, రవీంద్ర విజయ్, బిందు మాధవి, ఫణి ఆచార్య, తరుణ్
భాస్కర్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్
యాంగర్ గమ్స్. నాలుగు కథల ఆంథాలజీగా ఈ సిరీస్ ను రూపొందించారు దర్శకుడు
ప్రభల తిలక్. శ్రీధర్ రెడ్డి, సుహాస్ నిర్మించారు. యాంగర్ గేమ్స్ త్వరలో
స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ ను విడుదల
చేశారు.
టీజర్ లో రంగ, పూజ, రాధ, గిరి పాత్రలను పరిచయం చేశారు. టీజర్ లో ఇతర
ప్రధాన పాత్రధారులంతా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ లో కనిపించారు. ఈ
నాలుగు కథల్లో వారు ఎలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారు అనేది
త్వరలో తెలియనుంది.
ఈ వెబ్ సిరీస్ కు రచన – కార్తికేయ కరెడ్ల, ప్రభల తిలక్, సినిమాటోగ్రఫీ –
అమర్ దీప్, వినోద్ క బంగారి, వెంకట్ ఆర్ శాఖమూరి, ఏజే ఆరోన్, ఎడిటర్ –
కొడాటి పవన్ కళ్యాణ్, సంగీతం – స్మరణ్ శ్రీ, ప్రొడక్షన్ డిజైనర్ – అశోక్
నర్ర, కాస్ట్యూమ్స్, స్టైలింగ్ – సంజన శ్రీనివాస్, కో ప్రొడ్యూసర్ –
కృష్ణమ్ గడాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కార్తికేయ కరెడ్ల, పీఆర్వో –
జీఎస్కే మీడియా.