సిద్దూ జొన్నలగడ్డ – నేహా శెట్టి జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ” డీజే టిల్లు ”. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ ప్రకటించారు కూడా. సీక్వెల్ అలా ప్రకటించడమే ఆలస్యం ఇలా దర్శకుడు మారిపోయాడు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమా నుండి తప్పుకున్నానని ప్రకటించాడు దర్శకుడు.
కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ కూడా మారిపోయిందని తెలుస్తోంది. డీజే టిల్లు విజయంలో రాధిక పాత్రలో నటించి గ్లామర్ ని ఫుల్లుగా కుమ్మరించిన భామ నేహా శెట్టి. అయితే సెకండ్ పార్ట్ లో మాత్రం నేహా శెట్టి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ విషయాన్ని డీజే టిల్లు చిత్ర బృందం వెల్లడించాల్సిన అవసరం ఉంది.
ఇక అనుపమ పరమేశ్వరన్ విషయానికి వస్తే …… ఇన్నాళ్లు గ్లామర్ కు లిప్ లాక్ లకు దూరంగా ఉన్నపటికీ రౌడీ బాయ్స్ చిత్రంలో మాత్రం తన సరిహద్దులను బద్దలు కొట్టి లిప్ లాక్ లకు అలాగే శృంగార సన్నివేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షాక్ ఇచ్చింది. దాంతో పార్ట్ 2 లో అనుపమ అయితే మరింత బాగుంటుందని భావించాడట హీరో సిద్దూ జొన్నలగడ్డ.
Breaking News