దసరాకు బాక్స్ లు బద్దలు కావాల్సిందేనా ? అంటే అవుననే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. తెలుగువాళ్ళకు ముఖ్యమైన పండగ దసరా. ఈ పండగకు మెగాస్టార్ చిరంజీవి నటించిన ” గాడ్ ఫాదర్ ” చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మలయాళ చిత్రమైన ” లూసిఫర్ ” చిత్రానికి రీమేక్.
మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో నటించాడు. అక్కడ బ్లాక్ బస్టర్ కావడంతో దాన్ని తెలుగులో ” గాడ్ ఫాదర్ ” గా రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పాత్ర అద్భుతంగా కుదరడంతో బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని , దానికి దసరా సెలవులు కూడా తోడవ్వడంతో వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు.
ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ ఎత్తున విడుదల కానుంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పై మెగాస్టార్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అలాగే మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించడం విశేషం. ఓ పాటలో మెగాస్టార్ చిరంజీవి – సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులు వేయడంతో అభిమానులకు ఇది విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఈ సినిమాని అక్టోబర్ 5 న విడుదల చేయనున్నారు.