Bodyguard మన సెలెబ్రిటీలు ఎంత సంపాదిస్తారో తెలుసా? వారి సంపాదన వింటే ఆశ్చర్యమే. వారి డైరీల్లో ఖాళీ పేజీ ఉండదు. వారి ఆదాయం కూడా అలాగే ఉంటుంది. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా వారి కెరీర్ దూసుకుపోతుంది. వారికి బాడీగార్డ్ గా ఉండేవారి సంపాదన కూడా రూ. కోట్లలో ఉండటం గమనార్హం. వారికి సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వారి పారితోషికం తెలిస్తే షాకే. స్టార్ హీరోల బాడీగార్డులు అత్యధిక జీతం తీసుకుంటున్నారు.
వారు బయటకు వెళ్లాలంటే వీరు తోడు ఉండాల్సిందే. లేకపోతే బయటకు రాలేరు. వారికి సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వారికి నెలకు జీతం రూ. లక్షల్లో ఉంటుంది. హీరోలకు రక్షణ కవచం వలె ఉంటారు. ఏడాదికి వారి జీతం రూ.కోట్లలో ఉందంటే అతిశయోక్తి కాదు. వీరి జీతం చిన్న హీరోల రెమ్యూనరేషన్ తో సమానంగా ఉందంటే ఆశ్చర్యకరమే.
షారూఖ్ ఖాన్ బాడీ గార్డ్ రవిసింగ్ నెల వేతనం రూ. 17 లక్షలు. సంవత్సరానికి 2.7 కోట్లు ఉండటం గమనార్హం. తరువాత స్థానంలో సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా ఉన్నాడు. అతడి పారితోషికం నెలకు రూ. 15 లక్షలు. సంవత్సరానికి రూ. 2 కోట్లు. ఇతడు సల్మాన్ ఖాన్ దగ్గర 29 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అక్షయ్ కుమార్ బాడీగార్డ్ శ్రేయ్ సే థిస్లె ఏడాదికి రూ. 1.2 కోట్లు.
అమితాబ్ బచ్చన్ కు బాడీగార్డుగా పనిచేసిన జితేంద్ర షిండే ఏడాదికి రూ. 1.5 కోట్లు జీతం తీసుకుంటున్నాడు. ఆరేళ్లుగా అమితాబ్ బాడీగార్డ్ గా పనిచేస్తున్నాడు. అమీర్ ఖాన్ బాడీగార్డ్ యువరాజ్ ఘోర్సేకు సంవత్సరానికి రూ. రెండు కోట్లు. దీపికా పదుకునే బాడీగార్డ్ జలాల్ కు ఏడాదికి రూ. 1.2 కోట్లు. అనుష్క శర్మ బాడీగార్డ్ ప్రకాశ్ సింగ్ కు ఏడాదికి రూ. 1.2 కోట్లు తీసుకుంటున్నాడు.