nuvvu naku nachav movie టాలీవుడ్ లో ఆల్ టైం హిట్స్ లలో ”నువ్వు నాకు నచ్చావ్” ఒకటి.. ఈ బ్లాక్ బస్టర్ సినిమాను ఎప్పటికి ప్రేక్షకులు మర్చిపోలేరు.. ఇప్పటికే టీవీ లలో కొన్ని వందల సార్లు వేసి ఉంటారు. అయిన మళ్ళీ వస్తే టీవీ లకు అతుక్కుని మరీ చూస్తారు.. అంతలా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కట్టి పడేస్తుంది..
వెంకటేష్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా నువ్వు నాకు నచ్చావ్.. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఏకంగా 18 కోట్ల రూపాయలకు పైగానే షేర్ రాబట్టింది.
ఈ సినిమాతో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా పరిచయం అవ్వగా మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ అందుకుంది.. ఇకపోతే ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ స్నేహితురాలిగా నటించిన భామ మీకు గుర్తు ఉందా? ఈ భామ పేరు ఆశా షైనీ.. అలియాస్ ఫ్లోరా సైనీ.. ఈమె గురించి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.
ఎందుకంటే ఈమె చిన్న చిన్న రోల్స్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా చేసింది.. ప్రేమ కోసం అనే సినిమాతో ఈమె కెరీర్ స్టార్ట్ చేయగా మొత్తంగా 50కి పైగానే సినిమాల్లో నటించింది. ఈమె తెలుగులో నటించి చాలా కాలం అవుతుంది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడ వరుసగా సినిమాలు చేసింది.. ఈమెకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హాట్ గా మారిపోయిన ఈ భామను గుర్తు పట్టలేక పోతున్నారు. మరి అమ్మడి హాట్ ఫొటోస్ మీకోసం..