34.7 C
India
Friday, April 10, 2026
More

    పాతికేళ్ళు పూర్తి చేసుకున్న డాక్టర్ రాజశేఖర్ శివయ్య

    Date:

    Dr. rajasekhar's sivayya completes 25 years 
    Dr. rajasekhar’s sivayya completes 25 years

    యాంగ్రీయంగ్ మాన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన సంచలన చిత్రం ” శివయ్య ”. ఆర్. సురేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు నిర్మించడం విశేషం. 1998 మార్చి 27 న విడుదలైన శివయ్య బ్లాక్ బస్టర్ అయ్యింది. అంతకుముందు వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్న డాక్టర్ రాజశేఖర్ కు సాలిడ్ హిట్ ను అందించిన చిత్రం శివయ్య.

    డాక్టర్ రాజశేఖర్ సరసన మోనికా బేడీ , సంఘవి నటించగా కీలక పాత్రల్లో శ్రీహరి , చలపతిరావు , రవిబాబు , గిరిబాబు , అట్లూరి పుండరీకాక్షయ్య , అశోక్ కుమార్ , కోట శంకర్ రావు , నర్సింగ్ యాదవ్ , శివాజీరాజా , నరసింహరాజు , శివకృష్ణ , కేకే శర్మ , గణేష్ , వేణుమాధవ్ , రమాప్రభ , డాక్టర్ డి. రామానాయుడు తదితరులు నటించారు.

    ఎం ఎం శ్రీలేఖ సంగీతం అందించింది. ”మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది ” , ” నడిచే దేవుడు వచ్చాడు ” , ” ఓ రంగనాధ ” అనే పాటలు ప్రేక్షకులను అలరించాయి. 1998 మార్చి 27 న విడుదలైన శివయ్య చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో 1998 జులై  12 న హైదరాబాద్ లోని రామానాయుడు సినీ స్టూడియోలో అంగరంగ వైభవంగా శివయ్య శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు డాక్టర్ డి. రామానాయుడు. అసలు ఈ సినిమా తీసే సమయంలో డాక్టర్ రాజశేఖర్ తో సినిమా చేయడం ఏంటి ? అని అన్నారట చాలామంది. మిగతావాళ్ళతో పాటుగా హీరో వెంకటేష్ , సురేష్ బాబు కూడా అన్నారట. అయితే రామానాయుడు మాత్రం ఎవ్వరి మాట వినకుండా డాక్టర్ రాజశేఖర్ తో శివయ్య చిత్రాన్ని చేసాడు …… పెద్ద హిట్ కొట్టాడు. దాంతో రామానాయుడు తనయులు వెంకటేష్ , సురేష్ బాబు లు కూడా సంతోషం వ్యక్తం చేశారట….. నువ్వే గెలిచావ్ నాన్నా అంటూ.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Song : సిగ‌రెట్ పెట్టి మీద రాసిన పాట‌.. తెలుగు రాష్ట్రాల్లో అగ్నిగుండం పుట్టించింది?

    Viral Song : మనుషుల హృదయాల్లో సినిమా ఎంతటి ముద్ర వేస్తుందో.....

    LB Nagar Incident : మగువ తెగువ.. ప్రేమోన్మాదిని భయపెట్టిన ఝాన్సీ

    LB Nagar Incident : ఆడది అబల కాదు సబల మరోసారి రుజువైంది....

    ప్రేమికుల దినోత్సవం ……ప్రేమించి పెళ్ళి చేసుకున్న హీరో – హీరోయిన్ లు

    ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. మూడు దశాబ్దాల క్రితం వాలయింటైన్స్ డే...

    రాజశేఖరా….. కొట్టవయ్యా హిట్టు

    యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలకు పెట్టింది పేరు డాక్టర్ రాజశేఖర్. అంకుశం...