సినీ ప్రముఖులు డ్రమ్స్ శివమణి రామప్పను సందర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 వ సంవత్సరంలోకి అడుగు పెడుతుండటంతో పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ వజ్రోత్సవాలలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం, అలాగే పర్యాటక క్షేత్రమైన రామప్పను సందర్శించారు డ్రమ్స్ శివమణి. రామప్ప లో శివుడికి పూజలు నిర్వహించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు.
రామప్ప శిల్ప సంపదను చూసి అచ్చెరువొందిన శివమణి కాకతీయ కళావైభవానికి ఫిదా అయ్యారు. అలాగే JSW , Jaiswaraajya కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ తో మాట్లాడుతూ రామప్పను దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని సంతోషాన్ని వ్యక్తం చేసారు. అలాగే JSW యూట్యూబ్ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.