చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. గత రెండు రోజుల్లో ఏకంగా నలుగురు చనిపోయారు. ఇక ఈరోజు ఉదయం ఇద్దరు సినీ ప్రముఖులు చనిపోయారు దాంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. తెల్లవారు జామున సీనియర్ నటి జమున మరణించగా , అదే సమయంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కూడా చెన్నై లో గుండెపోటుతో మరణించాడు. తెలుగులో పలువురు స్టార్ హీరోలకు డబ్బింగ్ చెప్పాడు శ్రీనివాస మూర్తి. హీరో డాక్టర్ రాజశేఖర్ కు చాలాకాలం పాటు డబ్బింగ్ చెప్పాడు శ్రీనివాసమూర్తి. రాజశేఖర్ కు కెరీర్ ప్రారంభం నుండి కూడా సాయి కుమార్ డబ్బింగ్ చెప్పేవాడు. అయితే పోలీస్ స్టోరీ అనే చిత్రంలో హీరోగా నటించి అది బ్లాక్ బస్టర్ కావడంతో రాజశేఖర్, సుమన్ లకు డబ్బింగ్ చెప్పడం ఆపేసాడు. ఆ సమయంలో రాజశేఖర్, సుమన్ లకు డబ్బింగ్ ఈ శ్రీనివాస మూర్తి చేతే చెప్పించారు.
దాదాపు 10 సంవత్సరాల పాటు రాజశేఖర్, సుమన్ లు నటించిన పలు చిత్రాలకు డబ్బింగ్ చెప్పాడు. ఇక ఇదే సమయంలో తమిళం , మలయాళం , కన్నడ భాషల నుండి తెలుగులో డబ్బింగ్ అయిన చిత్రాలకు డబ్బింగ్ చెప్పాడు. సూర్య, అజిత్ , విక్రమ్ తదితర హీరోలకు కెరీర్ ప్రారంభంలో తెలుగు డబ్బింగ్ చిత్రాలకు గాత్రం అందించాడు. అలాగే పలు డబ్బింగ్ చిత్రాలకు కూడా గాత్రం అందించాడు. శ్రీనివాసమూర్తి చెన్నై లో మరణించాడు. దాంతో పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.