పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి , కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ” లైగర్ ”. విజయ్ దేవరకొండ హీరోగా నటించగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఇక కీలక పాత్రలో రమ్యకృష్ణ , ఆలీ , బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ లు నటించారు. ఆగస్టు 25 న విడుదలైన లైగర్ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే పాన్ ఇండియా చిత్రం కావడంతో పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది.
దాంతో బడ్జెట్ కూడా చాలా చాలా ఎక్కువగా పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించాడు పూరీ జగన్నాథ్. కట్ చేస్తే దారుణమైన ఫలితం ఎదురు కావడంతో బయ్యర్లు పూరీ వెంట పడ్డారు. పెద్ద గొడవే అయ్యింది. అది చాలనట్లు ఇప్పుడు ఈడీ దృష్టి కూడా లైగర్ ఆర్ధిక లావాదేవీలపై పడింది. దాంతో విజయ్ దేవరకొండ ఈడీ ముందుకు వెళ్తున్నాడు.