అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో హీరోయిన్ గా రంగప్రవేశం చేసిన తెలుగు భామ ఈషా రెబ్బా. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. అయితే ఈ భామకు అంతగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. హీరోయిన్ గా ఇంకా వేషాల కోసం ఎదురు చూస్తూనే ఉన్న ఈ భామ త్వరలోనే ఓ తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకోనున్నట్లు తమిళనాట ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
తెలుగులో పలు చిత్రాల్లో నటించింది ఈషా రెబ్బా . హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కకపోవడంతో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించింది. అయితే అవి ఈ భామకు అంతగా ఉపయోగపడలేదు. దాంతో తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే ఆ సమయంలో ఓ తమిళ దర్శకుడికి బాగా దగ్గరైందట. దాంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఈ విషయం ఇంట్లో చెబితే మొదట ఒప్పుకోలేదట. కానీ అటు తమిళ దర్శకుడు ఇటు ఈషా రెబ్బా కూడా గట్టి ప్రయత్నాలు చేయడంతో ఇక చేసేదిలేక ఒప్పుకున్నారట. దాంతో త్వరలోనే ఈషా రెబ్బా పెళ్లి అవ్వడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఈ వార్తలను ఈషా రెబ్బా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. తమిళనాట వస్తున్న ఊహాగానాలను ఖండించకపోవడంతో పెళ్లి ఖాయమే అని వినిపిస్తోంది.