
బోల్డ్ చిత్రాలతో , వెబ్ సిరీస్ లతో సంచలనం సృష్టిస్తున్న భామ ఏక్తా కపూర్ పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. OTT మాధ్యమంలో మీరు చూపిస్తున్న వెబ్ సిరీస్ లు , సినిమాలు యువతను పెడదారి పట్టించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు సైనికులను , సైనికుల కుటుంబాలను కించపరిచేలా , వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా XXX అనే వెబ్ సిరీస్ ప్రసారం చేస్తున్నారని , ఇలా చేయడం మీకు న్యాయమా ? అంటూ ప్రశ్నించింది కోర్టు.
ఏక్తా కపూర్ మొదటి నుండి కూడా అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా చేసి ఫేమస్ అయ్యింది. అలాగే ఏకంగా బాలాజీ ఆల్ట్ అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసి అందులో కూడా అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లను అందిస్తోంది. ఇవి ఎంత దారుణంగా ఉంటున్నాయంటే ఆల్మోస్ట్ సెక్స్ మూవీస్ లాగా ఉంటున్నాయి. దాంతో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా ఈ భామ మాత్రం అస్సలు లెక్క చేయడం లేదు.