
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనకు మళ్ళీ తోడు కావాలని ఆశపడుతోంది. అంతేకాదు ఆమేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది రేణు దేశాయ్. 2018 లో ఈ భామ రెండో పెళ్ళికి సిద్దపడింది. ఒక వ్యక్తితో ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది. ఇక త్వరలోనే పెళ్లి అని అంది కానీ ఆ తర్వాత పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు అంటే బహుశా ఆ పెళ్లి కాలేదు.
కట్ చేస్తే …… తోడు కావాలి అంటూ తాజాగా స్టేట్ మెంట్ ఇచ్చిందంటే మళ్ళీ పెళ్లి మీద గాలి మళ్లిందన్న మాట ఈ భామకు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పలు అవకాశాలు వచ్చాయి. అయితే ఇతర హీరోల చిత్రాల్లో నటించలేదు. పవన్ కళ్యాణ్ ని ప్రేమించి సహజీవనం చేసింది.
ఆ సమయంలోనే అకిరా నందన్ కు జన్మనిచ్చింది. కట్ చేస్తే 2009 లో ఎన్నికల సమయంలో రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఆద్య జన్మించింది. అయితే పెళ్లి చేసుకున్న మూడేళ్ళకే రేణు దేశాయ్ – పవన్ కళ్యాణ్ ల మధ్య తీవ్ర విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. దాంతో అప్పటి నుండి ఒంటరిగానే ఉంటోంది రేణు దేశాయ్. ఇక ఇప్పుడేమో మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.