
స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్ళికి సిద్ధమైంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సమంత మెడలో పసుపుతాడు ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు కొందరు. అయితే సమంత నిజంగానే రెండో పెళ్లి చేసుకుందా ? చేసుకోబోతుందా ? అనే టెన్షన్ నెలకొంది.
అయితే ఈ వార్త విషయానికి వస్తే …… సమంత – నాగచైతన్య గతంలో కలిసి దిగిన ఫోటోను ఇలా కట్ చేసి తమకు అనుకూలంగా మలుచుకొని సమంత రెండో పెళ్లి అంటూ వైరల్ అయ్యేలా చేసారు. ఇటీవల కాలంలో విడాకులు తీసుకోవడం అలాగే రెండో పెళ్లి చేసుకోవడం సర్వసాధారణమయ్యింది. దాంతో సమంత కూడా మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంది అని భావిస్తున్నారు.

అయితే ఈ రెండో పెళ్లి వార్త మాత్రం నిజం కాదని అంటున్నారు సమంత సన్నిహితులు. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా కొన్నాళ్ళు ఆగిపోయింది సమంత ఆరోగ్యం బాగోలేకపోవడంతో……. కట్ చేస్తే ఇప్పుడు సమంత కోలుకుంది కాబట్టి ఖుషి సెట్లోకి అడుగుపెట్టింది. దాంతో సమంతకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు యూనిట్ సభ్యులు.

నాగచైతన్య కు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యింది. మాయోసైటిస్ అనే వ్యాధికి గురయ్యింది. ఆ వ్యాధి నుండి కోలుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేసింది. ప్రస్తుతం కోలుకుంది దాంతో షూటింగ్ లకు హాజరు అవుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సమంత రెండో పెళ్లి అంటూ ఈ ఫోటోను పెట్టి హల్చల్ అయ్యేలా చేసారు కొంతమంది. అది ఇలా వైరల్ అవుతోంది అంతే .