నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సంచలన చిత్రం వీరసింహా రెడ్డి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. 2023 సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడానికి ఓవర్సీస్ లో పెద్ద పోటీ నెలకొంది. అయితే ఫ్యాన్సీ ఆఫర్ తో శ్లోక సంస్థ ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకుంది.
3.80 కోట్లతో సింగిల్ పేమెంట్ తో వీర సింహా రెడ్డి ఓవర్సీస్ హక్కులను శ్లోక సంస్థ హస్తగతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య చిత్రాలకు ఓవర్సీస్ లో అంతగా డిమాండ్ ఉండదు. కానీ అఖండ చిత్రం సృష్టించిన సంచలనంతో ఈ చిత్రానికి విపరీతమైన పోటీ ఏర్పడింది. బాలయ్య సరసన శ్రుతి హసన్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.