
Dil Movie : నితిన్ నేహా జంటగా వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా దిల్. ఇది రాజుకు మొదటి సినిమా. దీంతోనే అతడికి దిల్ రాజు అనే పేరు వచ్చింది. నితిన్ కు కూడా ఇది రెండో సినిమానే. మొదటి సినిమా జయం బ్రహ్మాండమైన విజయం సాధించగా రెండో సినిమా దిల్ కూడా అదే రేంజ్ లో హిట్ సాధించింది. దీంతో నితిన్ కు ఇక ఎదురు లేకుండా పోయింది.
2003లో వచ్చిన దిల్ అందరి అంచనాలు తలకిందులు చేసింది. దీంతో ఇండస్ట్రీలో నితిన్, వినాయక్ పేర్లు మారుమోగాయి. ఇద్దరికి ఇది రెండో సినిమా కావడం గమనార్హం. ఈ సినిమాలో నటించిన ఐదుగురు నటులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. విలన్, క్యారెక్టర్, హాస్య నటులున్నారు. వారితోనే సినిమా అంతటి ఖ్యాతినార్జించింది. ఇలా దిల్ సినిమాలో నటించి మరణించిన వారిలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
సినిమాలో ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ హీరో మావయ్యగా నటించాడు. తనదైన శైలిలో నవ్వులు పూయించే ఆయన ప్రస్తుతం మన మధ్యలో లేరు. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మరో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు చలపతి రావు కూడా గుండెపోటుతో అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఆయన లేని లోటు తీర్చలేనిది.
మరో కమెడియన్ ఎంఎస్ నారాయణ ఇందులో ప్రిన్సిపల్ పాత్రలో కనిపిస్తాడు. ఎల్బీశ్రీరామ్ అటెండర్ అయినా ఎంఎస్ తో ఆడుకుంటాడు. వారిద్దరి కామెడీ ఆకట్టుకుంటుంది. అలాంటి ఎంఎస్ మనల్ని వదిలి వెళ్లిపోయాడు. మరో విలన్ రాజన్ పి. దేవ్ కూడా అనారోగ్యంతో కన్ను మూశాడు. ఆయన హీరోయిన్ తాత పాత్రలో అద్భుతంగా నటించాడు.
ఇంకా ఎలాంటి పాత్రలనైనా అవలీలగా పోషించే ఆహుతి ప్రసాద్ కూడా చనిపోయారు. కోనసీమ భాషలో ఆయన ప్రతి సినిమాలో తన మేనరిజాన్ని చూపేవాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ప్రసాద్ స్వర్గస్తులు కావడం గమనార్హం. ఇలా ఈ సినిమాలో నటించిన ఐదుగురు నటులు చనిపోవడం నిజంగా బాధాకరమే. వారి నటన సినిమాకు మరింత ప్లస్ అయింది.






