
బావా …… నువ్ హీరోగా నటిస్తే ….. నేను హీరోయిన్ గా నటిస్తానంటూ సరదగా సీనియర్ నటుడు చంద్రమోహన్ తో వ్యాఖ్యానించింది ప్రముఖ నటి సుధ. చంద్రమోహన్ – సుధ జంటగా పలు చిత్రాల్లో నటించారు. ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడంతో కామెడీ బాగా పండింది. జంటగా మాత్రమే కాకుండా ఇతర పాత్రల్లో కూడా కలిసి నటించారు ఈ ఇద్దరు. అయితే ఎక్కువగా భార్యాభర్తలుగా నటించడంతో మంచి స్నేహం ఏర్పడింది. దాంతో చంద్రమోహన్ ను ఆప్యాయంగా బావా ….. బావా అని పిలుచుకుంటుంది. తాజాగా ర్ ఇద్దరూ కలిసి JSW & Jaiswaraajya.tv యూట్యూబ్ ఛానల్స్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
సాధారణంగా ఇంటర్వ్యూ అనగానే యాంకర్ ప్రశ్నలు వేయడం , సెలబ్రిటీలు సమాధానాలు ఇవ్వడం పరిపాటి. కానీ అందుకు భిన్నంగా చంద్రమోహన్ – సుధ ల ఇంటర్వ్యూ సాగింది. ఈ ఇంటర్వ్యూ హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో గల చంద్రమోహన్ స్వగృహంలో జరగడం విశేషం. చిలిపి ప్రశ్నలు వేస్తుంటే అంతే చిలిపిగా సమాధానాలు ఇవ్వడం ఈ ఇంటర్వ్యూ ప్రత్యేకత. చంద్రమోహన్ – సుధ ల మధ్య చక్కని స్నేహం ఉంది. దాంతో ఎలాంటి అరమరికలు లేకుండా ఈ కార్యక్రమం జరిగింది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. త్వరలోనే పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. సరదాగా సాగిన చిలిపి ఇంటర్వ్యూ ప్రోమో కింది లింక్ ఓపెన్ చేసి చూడండి…… చిల్ అవ్వండి.