నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్థాపబుల్ షో చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి సీజన్ దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. దాంతో అన్ స్థాపబుల్ 2 షో పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే రెండో సీజన్ కూడా హవా కొనసాగిస్తోంది.
తాజాగా బాలయ్య షోలో సందడి చేశారు సినీ దిగ్గజాలు దర్శకులు కె. రాఘవేంద్రరావు , అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు , దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి. ఈ నలుగురు కూడా తమ తమ ప్రత్యేకత చాటుకున్న సినీ దిగ్గజాలు కావడం గమనార్హం.
దర్శకుడిగా 100 కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన చరిత్ర కె. రాఘవేంద్రరావు ది. తెలుగు సినిమాను కమర్షియల్ గా కొత్త పుంతలు తొక్కించాడు. అలాగే 94 చిత్రాలకు దర్శకత్వం వహించి మెగా డైరెక్టర్ గా కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు ఏ. కోదండరామి రెడ్డి. ఇక అల్లు అరవింద్ , సురేష్ బాబు లు నిర్మాతలుగా సంచలన విజయాలను అందుకున్నారు. చరిత్ర సృష్టించారు. అలాంటి తెలుగు దిగ్గజాలు బాలయ్య షోలో సందడి చేయడం సంచలనంగా మారింది. ఆహా లో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. దాంతో అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి.