రేపు అక్టోబర్ 21 న నాలుగు చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఆ నాలుగు చిత్రాల్లో విజయం సాధించేది ఏది ? అనే ఆసక్తి నెలకొంది. రేపు విడుదల అవుతున్న నాలుగు చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ దేవుడిగా నటించిన ” ఓరి దేవుడా ” , మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ” జిన్నా ” , తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన ” సర్దార్ ”, శివ కార్తికేయన్ హీరోగా నటించిన ” ప్రిన్స్ ” చిత్రాలు ఉన్నాయి.
వీటిలో వెంకటేష్ దేవుడిగా నటించిన ఓరి దేవుడా పై కాస్త అంచనాలు ఉన్నాయి. ఆ సినిమాలో విషయం లేకపోతే వెంకటేష్ గెస్ట్ గా నటించడానికి ఒప్పుకోడు కదా ! అనే వాదన వినిపిస్తోంది. ఇక టీజర్ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో అది ముందు వరుసలో ఉంది.
తమిళ హీరో కార్తీ నటించిన విభిన్న చిత్రం సర్దార్ . ఈ చిత్రాన్ని తెలుగులో కింగ్ నాగార్జున విడుదల చేస్తుండటం గమనార్హం. దాంతో కాస్త ఈ సినిమాపై కూడా అంచనాలున్నాయి.
మంచు విష్ణు చాలాకాలంగా కమర్షియల్ హిట్ కోసం కష్టపడుతున్నాడు. ఇందులో గ్లామర్ తారలు సన్నీలియోన్ , పాయల్ రాజ్ పుత్ నటించడం విశేషం. వినోద ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం పై మంచు విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
ఇక జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రిన్స్ . శివ కార్తికేయన్ ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ ప్రిన్స్ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో విడుదల కానుంది. మరి ఈ నాలుగు చిత్రాల్లో విజయం దక్కించుకునేవి ఏవి ? అన్నది రేపు ప్రేక్షకులు వెలువరించనున్నారు.