అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారంటూ హీరో అక్కినేని నాగార్జునకు నోటీసులు ఇచ్చారు. నిర్మాణాలు తక్షణమే ఆపకపోతే కూల్చివేతకు దిగుతామని హెచ్చరించారు. ఇంతకూ నాగార్జున అక్రమ నిర్మాణం చేపడుతోంది ఎక్కడో తెలుసా ….. గోవాలో. అవును గోవాలోని మండ్రేమ్ పంచాయతీ పరిధిలో కొంత స్థలాన్ని కొన్నారు నాగార్జున.
కాగా ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధం అంటూ మండ్రేమ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నాగార్జునకు నోటీసులు పంపించారు. తక్షణమే ఆ నిర్మాణాలు ఆపాలని , లేనిపక్షంలో ఆ నిర్మాణాలను కూల్చి వేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చారు. మరి నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
నాగార్జునకు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూములు , ఫామ్ హౌజ్ లు , షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్న విషయం తెలిసిందే. సినిమాల్లో సంపాదించే దానికంటే ఇలా ఇతర మార్గాల్లో అంటే ……. రియాల్టీ రంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి బాగానే సంపాదిస్తున్నారు. పెద్దవాళ్లకు నోటీసులు రావడం ……. సెటిల్ మెంట్ అవ్వడం చాలా చాలా చిన్న విషయం. కాకపోతే అది సెటిల్ అయ్యేంత వరకు మాత్రమే ఇష్యూ అన్నమాట.