మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5 న భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాకు మొత్తం 90 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. మొదటి రోజున 38 కోట్ల గ్రాస్ వసూళ్లు ఆ మరుసటి రోజున 31 కోట్లు వసూల్ అయి తర్వాత తగ్గుముఖం పట్టాయి. మొత్తానికి వారం రోజుల్లో 120 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వసూల్ అయ్యాయి.
అంటే ఈ సినిమాను కొన్న బయ్యర్లకు భారీగా నష్టాలు రావడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటి వరకు 55 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. బయ్యర్లు సేఫ్ కావాలంటే మరో 38 కోట్ల షేర్ రావాలి. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ భారీ మొత్తం రావడం కష్టమే అనిపిస్తోంది. అంటే ఈ సినిమాను కొన్న బయ్యర్లు నష్టపోవడం ఖాయమని తెలుస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప గాడ్ ఫాదర్ బయ్యర్లు నష్టపోవడం ఖాయం.
రీ ఎంట్రీలో చిరంజీవి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఆ జోరు మాత్రం మెల్లి మెల్లిగా తగ్గుతోంది. ఆచార్య డిజాస్టర్ కావడంతో ఆ ఎఫెక్ట్ గాడ్ ఫాదర్ చిత్రంపై పడిందని తెలుస్తోంది. నిర్మాతకు మంచి లాభాలే వచ్చాయి ఈ చిత్రంతో ఎందుకంటే థియేట్రికల్ బిజినెస్ తో పాటుగా నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరిగింది. అంటే శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , ఓటీటీ రైట్స్ ఇలా పెద్ద మొత్తంలోనే నిర్మాతకు గిట్టుబాటు అయ్యింది కానీ బయ్యర్లు నష్టపోతున్నారు పాపం.