మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ ఈవెంట్ అనంతపురంలో భారీ ఎత్తున నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా చూడాలని పెద్ద ఎత్తున అనంతపురం కు తరలివచ్చారు అభిమానులు. అలా గుత్తి మండలం చెర్లోపల్లికి చెందిన రాజశేఖర్ (23), అభిరాం ఇద్దరు స్నేహితులు అనంతపురంకు బైక్ మీద రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తున్నారు.
అయితే రోడ్డుపై వేగంగా వెళ్తున్న సమయంలో ఓ కుక్క బైక్ కు అడ్డంగా రావడంతో స్పీడ్ ని కంట్రోల్ చేయలేక కిందపడ్డారు. బైక్ నుండి కిందపడటంతో రాజశేఖర్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన అభిరామ్ ను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. హీరోను చూడాలని వెళ్లిన రాజశేఖర్ అనంతలోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. అలాగే గాడ్ ఫాదర్ ఈవెంట్ నిర్వహిస్తున్న గ్రౌండ్ లో కూడా తీవ్ర తొక్కిసలాట కావడంతో పలువురు గాయపడ్డారు.