సల్మాన్ ఖాన్ కు మేనేజర్ ద్వారా డబ్బులు పంపిస్తే బూతులు తిట్టాడట. ఆ డబ్బులు తీసుకొని తక్షణం ఇంటి నుండి వెళ్లకపోతే మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడట. దాంతో మేనేజర్ చేసేదేమిలేక ఆ డబ్బులు తీసుకొని తిరిగి వచ్చాడట. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు …… మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ స్టార్ హీరో దాంతో ఆయన రెమ్యునరేషన్ కోట్లలోనే ఉంటుంది. స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చినప్పటికీ కనీసం ఓ 10 కోట్లు అయినా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అంత భారీ మొత్తాన్ని తీసుకోకుండా గాడ్ ఫాదర్ చిత్రంలో ఫ్రీగా నటించాడు సల్మాన్.
ఆయన స్టార్ హీరో కాబట్టి డబ్బులు తీసుకోకుండా నటిస్తే బాగోదు అని ఫీల్ అయిన చిరంజీవి మేనేజెర్ చేత డబ్బులు పంపిస్తే …… సల్మాన్ కు బాగా కోపం వచ్చిందట. దాంతో వార్నింగ్ ఇచ్చి పంపించాడట. ఇలా ఎందుకు చేసాడో తెలుసా ……. చిరంజీవి , చరణ్ లు నాకు అత్యంత ఆప్తులు అలాంటి వాళ్ళు నన్ను సినిమాలో నటించమని కోరితే డబ్బులు తీసుకుంటానా ? అని అన్నాడట సల్మాన్. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించాడు. సల్మాన్ కోసం చరణ్ కూడా ఏదో ఒకటి చేస్తాడని , మాకోసం ఫ్రీగా నటించిన సల్మాన్ కు కృతఙ్ఞతలు అంటూ సభాముఖంగా వెల్లడించాడు.