రేపు దసరా కానుకగా 3 సినిమాలు విడుదల అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల్లో కూడా విడుదల అవుతోంది గాడ్ ఫాదర్. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు కాబట్టి బాలీవుడ్ లో మంచి వసూళ్లు రావడం ఖాయం.
ఇక రేపు కింగ్ నాగార్జున హీరోగా నటించిన ద ఘోస్ట్ చిత్రం కూడా విడుదల అవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది. యాక్షన్ మసాలాతో రూపొందిన ఈ చిత్రం పై కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు ఆ చిత్ర బృందం. అయితే ఓపెనింగ్స్ భారీగా కనిపించడం లేదు ……. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి కానీ పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేవు . అయితే సినిమా బాగుంటే తప్పకుండా భారీ వసూళ్లు రావడం ఖాయం.
ఇక ముచ్చటగా మూడో సినిమా స్వాతిముత్యం. బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం ఇది. ఇక యూత్ కి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లుగా అర్ధం అవుతోంది. యూత్ కి కనెక్ట్ అయితే సినిమా మంచి హిట్ అవుతుంది. లేదంటే ఇద్దరు స్టార్ ల మధ్య ఇరుక్కొని నలిగిపోతుంది. ప్రస్తుతానికి అయితే మెగాస్టార్ చిరంజీవికి పోటీనే లేదని చెప్పాలి…… ఎందుకంటే గాడ్ ఫాదర్ పై భారీగానే అంచనాలున్నాయి మరి.