
పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ఎట్టకేలకు ఆహా టీమ్ శుభవార్త తెలిపింది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించిన వివరాలు మరో గంటలో అంటే జనవరి 20 రాత్రి 8 గంటలకు ఓ వీడియో విడుదల చేయనున్నారు. ఆమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బ్లాక్ బస్టర్ షో అన్ స్టాపబుల్. ఇప్పటికే బాలయ్య షో రికార్డుల మోత మోగిస్తుండటంతో పలువురు హీరోలు క్యూ కట్టారు. అన్ని ఎపిసోడ్ లకు కూడా భారీగా వ్యూస్ వచ్చాయి. అయితే ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్స్ రెండు కూడా సంచలనం సృష్టించాయి. ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ యావత్ టాక్ షోనే షేక్ చేయడం ఖాయమని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కున్న మాస్ ఇమేజ్ తో తప్పకుండా ఈ ఎపిసోడ్ రికార్డుల మోత మోగించడం ఖాయమని భావిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ బహుశా జనవరి 26 న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆహా లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.