డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు మరొక శుభవార్త ……. ఆదిపురుష్ నుండి ఈనెల 22 న ” జై శ్రీరామ్ …….. జై శ్రీరామ్ ” అనే పాటను విడుదల చేస్తున్నట్లుగా దర్శకుడు ఓం రౌత్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. అలాగే యధావిధిగా ఆదిపురుష్ సినిమా జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుందని ప్రకటించాడు కూడా.
ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రాన్ని గత ఏడాది విడుదల చేయాలనుకున్నారు. అయితే టీజర్ విడుదల చేసిన సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ను పెట్టి బొమ్మల సినిమాగా రూపొందించారని తీవ్ర విమర్శలు చేసారు నెటిజన్లు. ఇక ఆదిపురుష్ టీజర్ కనీసం ప్రభాస్ అభిమానులకు కూడా నచ్చలేదు.
దాంతో ఆదిపురుష్ సినిమా విడుదల వాయిదా వేశారు. మరింత మెరుగ్గా ఆదిపురుష్ చిత్రాన్ని తీర్చి దిద్దే పనిలో పడింది చిత్ర బృందం. అయితే ఎలా చూసినా కూడా యానిమేషన్ మూవీ లా కనబడుతోంది అనే ముద్ర మాత్రం పడిపోయింది. అయితే ఈ జూన్ లో ఆదిపురుష్ విడుదల కానుంది కాబట్టి ఆ ముద్ర అలాగే ఉంటుందా ? లేదా ? అన్నది తెలుస్తుంది. ఇక పొతే ఈనెల 22 న జై శ్రీరామ్ …… జై శ్రీరామ్ అనే పాట విడుదల అవుతోంది కాబట్టి ఆ పాట అలరించేలా ఉంటుందా ? అనే ఆసక్తి నెలకొంది. ప్రభాస్ శ్రీరాముడిగా నటించగా సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటించాడు. ఇక సీతగా కృతి సనన్ నటించింది.