
సంక్రాంతి విన్నర్లు గా నిలిచిన దర్శకులు సైలెంట్ అయ్యారు. వాల్తేరు వీరయ్యతో బాబీ… వీరసింహారెడ్డి తో గోపిచంద్ మలినేని బ్లాక్ బస్టర్లు కొట్టారు. దీంతో ఇండస్ట్రీలో ఇద్దరూ పేర్లు తెగ మారుమోగిపోయాయి. అంతేకాక తమ అభిమాన హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చి..తమ అభిమానాని చాటుకున్నారు. పైగా బిగ్ స్క్రీన్ పై మెగా నందమూరి అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి.. వారి అబిమానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి ఆ ఇద్దరూ ఇప్పుడు కూడా ఖాళీగా కూర్చున్నారు. ఈ ఇద్దరు దర్శకులు కూడా హీరోల డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
గోపి చంద్ మలినేని నెక్ట్స్ ప్రాజెక్ట్ రవితేజలో తీస్తారని అనుకున్నారు. క్రాక్ సిక్వెల్ ను నెక్ట్స్ లెవల్ లో ఉండేలా ప్లాన్ చేశారట .కట్ చేస్తే రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. పైగా డేట్స్ ఇప్పట్లో దొరకడం కష్టమనుకున్న గోపిచంద్… బాలయ్యకు అదిరిపోయే స్టోరీ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే నందమూరి నటసింహ ఎన్ బీకే 108 తో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీని తర్వాత బోయపాటితో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. దీంతో గోపిచంద్… మరో హీరో కోసం వెయిట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్. ఇటు బాబీ పరిస్థితి ఇంచుమించు అలానే ఉన్నట్లు తెలుస్తోంది.
మరోపక్క బాబీకి ఎన్ని ఆఫర్లు వస్తున్నప్పటికీ. .బాబీ మనసు మాత్రం మెగా కాంపౌండ్ దాటి రావడం లేదని తెలుస్తోంది. తన తదుపరి సినిమాను వీలైతే మెగా హీరోతోనే తీయాలని అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.ఆ మధ్య రామ్ చరణ్ కు కూడా ఓ కథ వినిపించాడని జోరుగా ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని తేలిపోయింది. ఇటు సాయిధరమ్ తేజ్ తో కూడా సినిమా తీయాలనుకుంటున్నాడు. కానీ తేజు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ తో పాటు రామ్ తో సినిమాకు ప్లాన్ చేశాడు కానీ వర్క్ అవుట్ కాలేదు.దీంతో చేసేది లేక మ్యాచ్ స్టార్ గోపిచంద్ ను ట్రై చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ ఓ న్యూస్ తెగ సర్క్యూలేట్ అవుతోంది. అది కూడా మల్టీస్టారర్ కథ అని తెలుస్తోంది. హీరో గోపీచంద్ పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యాడని టాక్. ఈ కథకి మరో హీరో కూడా ఓకే చెబితే .. సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి సక్సెస్ కొట్టిన ఇద్దరూ డైరెక్టర్లు ఖాళీగా ఉండటంతో ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు.