మహానటుడు, మహా నాయకుడు నందమూరి తారకరామారావు కు భారత ప్రభుత్వం గొప్ప గౌరవాన్ని ఇస్తోంది. ఎన్టీఆర్ బొమ్మ తో 100 రూపాయల కాయిన్ ముద్ర వేయడానికి నిర్ణయించింది. ఇందుకు సంబంధించి 100 కాయిన్ మీద ఎన్టీఆర్ బొమ్మ ఎలా ఉండాలి అనే దానిపై మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ని మింట్ అధికారులు సంప్రదించారు. ఎన్టీఆర్ బొమ్మ ఎలా ఉండాలో …….. అధికారులకు సూచనలు ఇచ్చారు పురంధేశ్వరి.
భారత ప్రభుత్వం పలువురు ప్రముఖులకు తగిన గౌరవం ఇస్తూ పోస్టల్ స్టాంప్ లను అలాగే రూపాయల మీద బొమ్మలను ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఎన్టీఆర్ 100 రూపాయల కాయిన్ ప్రజల్లోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
నందమూరి తారకరామారావు అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు. తెలుగు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన దార్శనికుడు. అందుకే భారత ప్రభుత్వం ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం ఇవ్వాలని భావించింది.