
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే రిస్క్ కు పెట్టింది పేరు. పాత్ర కోసం తనని తాను ఏ విధంగానైనా మార్చుకునేందుకు రెడీ అయిపోతుంటాడు. ఎంత సాహసమైనా చేస్తుంటాడు. ఇప్పటికే ఆ విషయం చాలా సినిమాల్లో రుజువైంది. తాజాగా NTR 30 కోసం యమ కసరత్తులు చేస్తున్నాడు యంగ్ టైగర్ . తన పాత్ర పండేందుకు పెద్ధ రిస్క్ కే రెడీ అయిపోతున్నాడు.
NTR 30 ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తయింది. తారక్ తో సహా కీలక నటీనటుల పై సీన్లను తీశారు. యాక్షన్ తో ఎన్టీఆర్ అదరగొట్టాడనే టాక్ వినిపిస్తోంది. పైగా రీసెంట్ గా లీక్ అయిన ఫోటోలు జాలరీగా కనిపించి సినిమాపై అంచనాలు పెంచాడు తారక్. ఇక రెండవ షెడ్యూల్ ఈ నెలఖరు నుంచి గోవా లో మొదలవుతుందని అంతా భావిస్తుండగా… ఇప్పుడా ప్లానింగ్ మారినట్లు తెలుస్తోంది. తారక్ మళ్లీ లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ గ్యాప్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఎన్టీఆర్ 30లో యంగ్ టైగర్ డబుల్ రోల్స్ లో నటిస్తున్నాడు. ఈ రోల్స్ లో వెరియేషన్ ను చూపించేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం సెకండ్ షెడ్యూల్ లో కోసం ఏకంగా నెల రోజుల పాటు తారక్ విరామంలో ఉంటాడని అంటున్నారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటని అంత ఆలోచనలో పడ్డారు. అయితే దీని వెనుక ఇంట్రెస్టింగ్ విషయం ఉందని తెలుస్తోంది. ఈ గ్యాప్ కూడా యంగ్ టైగర్ కావాలని తీసుకుంటుంది కాదని పాత్ర మేకోవర్ కోసమేనని అంటున్నారు. గడ్డం మీసాలు ఇంకా బాగా పెంచాలని దర్శకుడు సూచించడంతో విరామానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ లో కొరటాల తారక్ లేని ఇతర నటీనటులు పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.మళ్ళీ మేలాఖరుకల్లా టీమ్ తో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.






