సీతారామం చిత్రంతో సంచలన విజయం అందుకున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. అందాల రాక్షసి చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన హను రాఘవపూడి పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అయితే దర్శకుడిగా మంచి పేరు వచ్చింది కానీ సక్సెస్ మాత్రం సాలిడ్ గా అందుకోలేకపోయారు హను రాఘవపూడి.
అలాంటి సమయంలో వైజయంతి మూవీస్ వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు ఈ దర్శకుడికి. హను రాఘవపూడి చేస్తున్న సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి అలాంటిది ఇతడికి వైజయంతి మూవీస్ లాంటి పెద్ద సంస్థ ఛాన్స్ ఇవ్వడం ఏంటి ? అని అనుకున్నారు అంతా. అంతెందుకు అశ్వనీదత్ తన కూతురు స్వప్నను ప్రశ్నించాడట ప్లాప్ డైరెక్టర్ తో సినిమా ఏంటి ? అని.
అంతేకాదు ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుంది మరికొన్ని కోట్లు పోతాయి అని ఫిక్స్ అయ్యాడట కూడా. కట్ చేస్తే స్వప్న మొండిపట్టు పట్టి హను కు ఛాన్స్ ఇచ్చింది. దాంతో సీతారామం రూపొందింది. కట్ చేస్తే ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. కేవలం 20 కోట్ల లోపు బడ్జెట్ పెడితే ఈ సినిమా ఏకంగా 50 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. హను రాఘవపూడిని తక్కువగా అంచనా వేసినందుకు అశ్వనీదత్ బాధపడ్డాడు కూడా. సీతారామం ఇచ్చిన జోష్ తో కొత్త సినిమాకు రెడీ అయ్యాడు హను. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో హను తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు.