36.5 C
India
Friday, April 10, 2026
More

    ఆదిపురుష్‌లో హనుమంతుడు… జై శ్రీరామ్ అంటోన్న ఫ్యాన్స్..!

    Date:

    Hanuman in Adipurush... Jai Sriram Antonna fans.
    Hanuman in Adipurush… Jai Sriram Antonna fans.

    ప్రభాస్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆదిపురుష్. ఈ సినిమా ఏ మూహూర్తన ప్రారంభించారో.. అప్పటి నుంచి కాంట్రావర్శీలకు కేరాఫ్ గా మారింది. సినిమా అప్ డేట్స్ ఇచ్చినా… ఇవ్వకపోయినా ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. రీసెంట్ గా శ్రీరామనవమి కానుకగా రిలీజైన పోస్టర్ పై ఓ రేంజ్ లో వివాదం రాజుకుంది. రాముడి, సీతాదేవి, హనుమంతుడి గెటప్ లు… హిందువుల మనోభావాలాను దెబ్బతీసేలా ఉన్నాయంటూ…ఇప్పుడు ఏకంగా ముంబైలోని సాకనాకి పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. వివాదాలు చుట్టుముట్టిన మేకర్స్ మరో పోస్టర్ రిలీజ్ చేశారు.

    హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ నుంచి హనుమంతుడి పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రాముడికి భక్తుడు, రామ కథకి ప్రాణం, జై పవన పుత్ర హనుమాన్ అని పోస్ట్ చేశారు. అయితే హనుమాన్ ధ్యానంలో ఉన్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొండను సైతం ఎత్తగల బలం ఉన్న హనుమంతుడి పాత్ర స్వరూపాన్ని పక్కాగా ఈ పోస్టర్‌లో చూపించారు. కండలు తిరిగిన శరీరంతో ఉన్న ఈ హనుమంతుడి పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ బ్యా గ్రౌండ్ లో ప్రభాస్ కనిపిస్తున్నాడు.అయితే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లలో ఈ పోస్టర్ తెగ ఆకట్టుకుంటుంది.

    400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చెడుపై గెలిచిన మంచిని చూపిస్తూ.. ఆధునిక కాలానికి అన్వయించి రాబోతోన్న ఈ చిత్రం ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో రిలీజైన ఈ మూవీ టీజర్ విమర్శల పాలైంది. దీంతో ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో తీర్చిదిద్దేందుకు కొన్ని భాగాలను రీ షూట్ చేశారు. అందుకోసం మళ్లీ భారీగానే ఖర్చుపెడుతూ.. పాన్ ఇండియా మూవీలాగా తీర్చిదిద్దుతున్నారు. అయినా మూవీకి వివాదాలు మాత్రం తప్పడం లేదు. వరుస విమర్శలు వస్తున్నా…రీసెంట్ గా రిలీజైన హనుమాన్ పోస్టర్ మాత్రం అందరి మనసు గెలుచుకుంది

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథ ఎందుకు సినిమాగా చేయలేకపోయింది?

    Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్‌కి ఉన్న గుర్తింపు మరే...

    Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్న ప్రభాస్

    Prabhas Marriage : 45 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రభాస్ టాలీవుడ్‌లో మోస్ట్...

    Prabhas : వేల సంబంధాలు వచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం?

    Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త...

    Prabhas : ఈ ఊరు పేరు ‘ప్రభాస్’

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపై ఓ ఊరుందనే విషయం...