అయోధ్య లోని రామమందిరాన్ని సందర్శించింది హనుమాన్ టీమ్. శ్రీరాముడి భక్తుడు ఆంజనేయస్వామి దాంతో ఆ సెంటిమెంట్ పరంగా కూడా అయోధ్యను దర్శించుకుంది హనుమాన్ బృందం. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” హనుమాన్ ”. తేజస్వి సజ్జ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇటీవలే విడుదలైంది. హనుమాన్ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.
గ్రాఫిక్స్ ఎక్కడ ఎలా వాడుకోవాలో దర్శకుడు ప్రశాంత్ వర్మకు బాగా తెలుసు అనే పేరు కూడా వచ్చింది. అసలు విషయం చెప్పాలంటే ……. డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్ర టీజర్ , ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేదు. గ్రాఫిక్స్ క్వాలిటీగా లేవని పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది కూడా. సరిగ్గా అలాంటి సమయంలోనే హనుమాన్ టీజర్ రిలీజ్ కావడం , దానికి పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావడంతో హనుమాన్ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
తెలుగులో విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన ప్రశాంత్ వర్మ కు ఇది పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. విజువల్స్ కు అద్భుత స్పందన రావడంతో చిత్ర బృందం చాల సంతోషంగా ఉంది. ఆ నేపథ్యంలోనే అయోధ్యలోని రామమందిరాన్ని దర్శించుకున్నారు. త్వరలోనే హనుమాన్ చిత్రం విడుదల కానుంది.