యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలకు పెట్టింది పేరు డాక్టర్ రాజశేఖర్. అంకుశం లా గర్జించాలన్నా …… అల్లరి ప్రియుడు గా రక్తి కట్టించాలన్నా డాక్టర్ రాజశేఖరే….. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాజశేఖర్ ను అల్లరి ప్రియుడు గా మార్చింది దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. రాజశేఖర్ ఏంటి ? లవ్ , సాంగ్స్ ఏంటి ? అని అనుకున్న వాళ్లకు సిల్వర్ జూబ్లీ సినిమా అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు రాఘవేంద్రరావు. అల్లరి ప్రియుడు చిత్రానికి మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది.
రాజశేఖర్ ఇద్దరు హీరోయిన్ లతో రొమాన్స్ చేయడం ఏంటి? పాటలు ….. డ్యాన్స్ …. ఆ….. ఎవరు చూస్తారండి అనే మాటలు వినిపించాయి. దానికి తగ్గట్లే మొదటి నాలుగు రోజులు పెద్దగా జనాలు లేరు కానీ మెల్లిగా ….. మెల్లి మెల్లిగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయి వారం రోజుల తర్వాత అన్ని చోట్లా హౌజ్ ఫుల్స్ పడటమే కాకుండా మరిన్ని థియేటర్లు కూడా పెరిగాయి. దాంతో 250 రోజులు మాత్రమే కాదు ఏకంగా ఏడాది పాటు ఈ చిత్రం ప్రదర్శితం అవ్వడం అప్పట్లో సంచలనమే అయ్యింది. ఇక రాజశేఖర్ కెరీర్ లో కూడా 90 వ దశకం చాలా కీలకం. తెలుగునాట స్టార్ హీరోగా స్థిరపడ్డారు.
అయితే 80 – 90 వ దశకంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన రాజశేఖర్ 2000 తర్వాత తన స్టార్ డం కోల్పోయారు….. వరుస ప్లాప్ లతో. రాజశేఖర్ ఇక రేసులో లేనట్లే అని అనుకుంటున్న తరుణంలో ఎవడైతే నాకేంటి, గోరింటాకు చిత్రాలతో సత్తా చాటాడు. మళ్లీ కొంతకాలం నిరాశ , నిస్పృహలతో రాజశేఖర్ కెరీర్ సాగింది. కట్ చేస్తే గరుడ వేగ చిత్రంతో మళ్లీ విజయం అందుకున్నాడు. అలాగే కల్కి చిత్రంతో ఫరవాలేదనిపించాడు. శేఖర్ అనే సినిమాతో మంచి ప్రయోగం చేసాడు కానీ అది విడుదల కాగానే బోలెడు డ్రామా ప్లే అయి ఆ సినిమాను థియేటర్ లనుండి తొలగించారు. ఇక ఇప్పుడేమో మళ్లీ బిజీ అవుతున్నాడు. దాంతో రాజశేఖర్ ను అభిమానించే అభిమానులు రాజశేఖరా…… కొట్టవయ్యా హిట్టు అని అంటున్నారు. ఈ సీనియర్ హీరో పవర్ ఫుల్ పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈరోజు ఫిబ్రవరి 4 డాక్టర్ రాజశేఖర్ పుట్టినరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని డాక్టర్ రాజశేఖర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది www.jaiswaraajya.tv.