
ఈరోజు కింగ్ నాగార్జున పుట్టినరోజు. మహానటులు అక్కినేని నాగేశ్వర్ రావు వారసుడిగా చిత్రరంగ ప్రవేశం చేసినప్పటికీ నాగార్జున కూడా మొదట్లో చాలా రకాల ఇబ్బందులను , అవమానాలను ఎదుర్కొన్నాడు. కట్ చేస్తే తనని తాను మలుచుకున్న తీరుకు టాలీవుడ్ ఫిదా అయ్యిందనే చెప్పాలి. మూస ధోరణిలో వెళుతున్న టాలీవుడ్ కు స్పీడ్ అందించిన హీరో నాగార్జున.
ఒకవైపు కుటుంబ కథా చిత్రాలు చేస్తూనే ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. అంతేకాదు మూసధోరణిలో వెళుతున్న టాలీవుడ్ కు సరికొత్త పంథాని నేర్పించిన హీరో నాగార్జున కావడం విశేషం. శివ చిత్రంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు నాగార్జున. శివ చిత్రం టాలీవుడ్ లో సరికొత్త ప్రభంజనం సృష్టించింది. తెలుగు సినిమాను శివ చిత్రానికి ముందు శివ చిత్రం తర్వాత అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
ప్రేమకథా చిత్రాలు అలాగే యాక్షన్ చిత్రాలు మాత్రమే కాదు భక్తి రస చిత్రాలను కూడా చేసి మెప్పించిన ఘనుడు నాగార్జున. అన్నమయ్య , శ్రీరామదాసు , ఓం నమో వేంకటేశాయ, షిరిడి సాయి తదితర చిత్రాలను చేసాడు నాగార్జున. ఇక అన్నమయ్య చరిత్ర సృష్టించింది. శ్రీరామదాసు కూడా సూపర్ హిట్ అయ్యింది. రక్తి చిత్రాలకు మాత్రమే కాదు భక్తి చిత్రాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు కింగ్. 63 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సత్తా చాటుతున్నాడు. ఆగస్టు 29 నాగార్జున పుట్టినరోజు దాంతో ఆ సందర్బంగా కింగ్ నాగార్జున కు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది జైస్వరాజ్య డాట్ టీవీ.