38.5 C
India
Thursday, March 28, 2024
More

    తారకరత్న పుట్టినరోజు ఈరోజే

    Date:

    happy birthday Nandamuri Taraka Ratna
    happy birthday Nandamuri Taraka Ratna

    నందమూరి తారకరత్న పుట్టినరోజు ఈరోజే . తన పుట్టినరోజుకు మూడు రోజుల ముందే మరణించాడు. దాంతో తారకరత్న కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు. మహాశివరాత్రి పర్వదినం రోజునే నందమూరి తారకరత్న శివైక్యం పొందారు. దాంతో నందమూరి కుటుంబం తారకరత్నను గుర్తు చేసుకుంటూ కుమిలిపోతోంది.

    1983 ఫిబ్రవరి 22 న నందమూరి మోహన కృష్ణ – శాంతి మోహన్ దంపతులకు జన్మించాడు తారకరత్న. సరిగ్గా తాతయ్య నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకు తారకరత్న జన్మించడం విశేషం. దాంతో తారకరత్నకు కూడా NTR అనే పేరు వచ్చేలాగే పేరు పెట్టారు.

    2022 లో ఒకేరోజున 9 సినిమాలు ప్రారంభించి చరిత్ర సృష్టించాడు నందమూరి తారకరత్న. అయితే అట్టహాసంగా 9 సినిమాలు ప్రారంభించారు కానీ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాడు తారకరత్న. దాంతో ఆశించిన స్థాయిలో కెరీర్ సాగలేదు. దానికి తోడు పెళ్లి అయి విడాకులు తీసుకున్న అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తారకరత్న.

    ఈ ప్రేమ పెళ్లి తారకరత్న కుటుంబానికి నచ్చలేదు. వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదు దాంతో ఒంటరి అయ్యాడు తారకరత్న. ప్రేమించిన అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టాడు. ఆర్ధిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ఓటీటీ రూపంలో కొన్ని అవకాశాలు వస్తున్నాయి దానికి తోడు కుటుంబ కలహాలు కూడా లేకుండాపోయాయి. దాంతో మళ్ళీ కుటుంబానికి దగ్గరయ్యాడు. అంతా బాగుంది ….. ఇక 2024 లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ఫిక్స్ అయ్యాడు తారకరత్న.

    అలాంటి సమయంలోనే ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురవ్వడం 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు అసువులు బాసాడు. కేవలం 40 ఏళ్ల వయసు కూడా లేని సమయంలోనే తారకరత్న మరణించడం నందమూరి కుటుంబంతో పాటుగా టీడీపీ శ్రేణులను , ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది. మహాశివరాత్రి రోజునే శివయ్యలో ఐక్యం అయ్యాడు. పుట్టినరోజుకు మూడు రోజుల ముందే మరణించడంతో అతడ్ని తలుచుకుంటూ తీవ్ర ఉద్వేగానికి లోనౌతున్నారు కుటుంబ సభ్యులు.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    Punjab CM : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ ముఖ్యమంత్రి..

    Punjab CM : పంజాబ్ సీఎం భగవoత్  సింగ్ మాన్ 50...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Devara : దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..? 

    Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ...

    NTR : అనవసరంగా ఈ సినిమాలు చేశానని బాధపడ్డ ఎన్టీఆర్..

    NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా...

    NTR : కక్కినకూటికి ఆశపడని అభిమాన ధనుడు ఎన్టీఆర్.. జూనియర్ ఎన్టీఆర్ చేవ చచ్చిందా..? సత్తా ఉడిగిందా..!

      ఎన్టీఆర్ అంటే నిలువెత్తు ఆత్మాభిమానం.. ఎన్టీఆర్ అంటే లీడర్, నెవర్ ఎ ఫాలోవర్...

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నేత ఎన్టీఆర్

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నాయకుడు ఎన్టీఆర్. రాజకీయాలకు కొత్త...