
Happy Birthday Prabhas:అక్టోబర్ 23 ……. అభిమానులకు పండగ రోజు ఎందుకో తెలుసా …… డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులు బిల్లా చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. డార్లింగ్ మరింతగా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్బంగా పలు ఆసుపత్రుల్లో పాలు , బ్రెడ్లు , పండ్లు పంపిణీ చేస్తున్నారు …… ప్రభాస్ ను ఆశీర్వదించాలని కోరుతున్నారు.
ఇక బిల్లా సినిమా విషయానికి వస్తే ……. 2009 లో విడుదలై బిల్లా మంచి విజయం సాధించింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇన్నాళ్ల తర్వాత ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా మళ్ళీ విడుదల చేసారు. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభిస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.
కృష్ణంరాజు వారసుడిగా చిత్ర రంగప్రవేశం చేసిన ప్రభాస్ బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ నటించే ప్రతీ సినిమా 500 కోట్ల పైమాటే అంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు 10 కోట్ల లోపు మార్కెట్ మాత్రమే ఉన్న ప్రభాస్ ఇప్పుడు 500 కోట్ల నుండి 1000 కోట్ల రేంజ్ కు చేరుకుంటోంది. ఈ ఘనత మరే తెలుగు హీరోకు లేదు అనడంలో సందేహమే లేదు.