
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈరోజు మార్చి 27 హీరో రాంచరణ్ పుట్టినరోజు. పైగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు అనే పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో మెగా అభిమానులు అంగరంగ వైభవంగా ఈ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా చిరుత అనే చిత్రంతో చిత్ర రంగప్రవేశం చేసాడు రాంచరణ్. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే అదే సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చి పడ్డాయి. చరణ్ ముఖం , మూతి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది అలాగే విమర్శలు కూడా వచ్చి పడ్డాయి.
అయితే ఎన్ని విమర్శలు వచ్చినా వాటినే తన సోపానాలుగా మలుచుకొని తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ డం అందుకున్నాడు. మగధీర చిత్రంతో తెలుగు చలన చిత్ర రికార్డులను బద్దలుకొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. చరణ్ కు మగధీర చిత్రం కేవలం రెండో సినిమా కావడం గమనార్హం. అయితే ఈ సినిమా తర్వాత అపజయాలు పలకరించినప్పటికీ మళ్ళీ తనని తాను మలుచుకున్న తీరుకు మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
తుఫాన్ అనే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సమయంలో కూడా చరణ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఒకప్పుడు బాలీవుడ్ వాళ్ళు చరణ్ ను తీవ్రంగా విమర్శించారు కట్ చేస్తే ఇప్పుడు అదే బాలీవుడ్ వాళ్ళు చరణ్ ను నెత్తిన పెట్టుకుంటున్నారు ఆర్ ఆర్ ఆర్ చిత్రం సాధించిన విజయాన్ని చూసి.
మొత్తానికి 16 సంవత్సరాల కెరీర్ లో చరణ్ ఇప్పటి వరకు చేసింది 14 చిత్రాలు మాత్రమే ! అలాగే విజయాలు ఎక్కువే ! తాజాగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు చరణ్. ఈరోజు చరణ్ పుట్టినరోజు కావడంతో పలువురు సెలబ్రిటీలు , అభిమానులు పెద్ద ఎత్తున చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రాంచరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది JSW & Jaiswaraajya.tv
Proud of you Nanna.. @AlwaysRamCharan
Happy Birthday!! 🎉💐 pic.twitter.com/JnDXc50N8W— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2023