Pokiri movie ఏదైనా ఇండస్ట్రీలో సినిమా హిట్ అవ్వాలన్నా ఇండస్ట్రీ హిట్ గా ఆ సినిమా నిలబడాలన్న అప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా సృష్టించని సరికొత్త రికార్డులు సృష్టించాలి.. అప్పుడే అది ఇండస్ట్రీ హిట్ అవుతుంది.. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది.. ఈ సినిమా రిలీజ్ 40 కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా నిలిచింది.
పోకిరి సినిమా ఇంతగా హిట్ అవ్వడానికి కారణం పూరీ మార్క్ టేకింగ్ అనే చెప్పాలి.. ఈయన సినిమాను నడిపించిన విధానం మహేష్ బాబు చేత కూడా ఆ టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చేయించడం పూరీకే చెల్లింది.. అంతేకాదు మహేష్ బాబు పండు క్యారెక్టర్ లో ఇంవోల్వ్ అయ్యి చెయ్యడం ఆయన డైలాగ్స్ అన్ని కూడా ఈ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి..
ఇదిలా ఉండగా ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీ కథ ముందుగా మహేష్ కు కాకుండా వేరే హీరోకు పూరీ చెప్పారట.. పవన్ కళ్యాణ్ ను అనుకుని ఆయన కొన్ని కారణాల వల్ల ఒప్పుకోక పోవడంతో మహేష్ తో చేశారట.. ఇక బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు ఈ సినిమా హిందీ రీమేక్ లో హీరోగా ఛాన్స్ వస్తే మిస్ చేసుకున్నాడట.
ఒక వేళ హిందీ పోకిరి రీమేక్ లో సోనూసూద్ కనుక చేసి ఉంటే ఈయన ఎప్పుడో స్టార్ హీరో అయిపోయి ఉండేవాడు.. కానీ ఈ ఛాన్స్ ను ఈయన మిస్ చేసుకోవడంతో సల్మాన్ ఖాన్ హీరోగా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అదే సోనూసూద్ చేసి ఉంటే బాగుండేది అని ఈయన లైఫ్ మరింత హై లో ఉండేది అని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.