సూపర్ స్టార్ మహేష్ బాబు ఈనెల 22 న లండన్ వెళ్తున్నాడు. తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. SSMB28 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. మహేష్ కు ఇది 28 వ సినిమా కావడంతో SSMB28 వర్కింగ్ టైటిల్ గా మారింది. అయితే ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు ఎందుకంటే మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఈనెల 22 న లండన్ వెళ్తున్నాడు.
అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. ఆ తర్వాత అంటే సంక్రాంతి ముందు ఇండియాకు తిరిగి రానున్నాడు. మహేష్ బాబు , నమ్రత , సితార , గౌతమ్ లతో పాటుగా మరికొంత మంది కుటుంబ సభ్యులు కూడా లండన్ వెళ్లనున్నారట. అక్కడ కొద్ది రోజులు సందడి చేసి సంక్రాంతి ముందు హైదరాబాద్ కు రానున్నారు.
వచ్చిన తర్వాత అంటే బహుశా పండగ తర్వాత త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ కావచ్చు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇలా వెకేషన్ కు ఎందుకంటే ……. తండ్రి కృష్ణ మరణంతో తీవ్ర దుఃఖసాగరంలో ఉన్న మహేష్ ఆ విషాదానికి కాస్త దూరంగా ఇలా లండన్ ట్రిప్ కు వెళ్తున్నాడు.